ఉషోదయంలొ..
నన్ను తాకే చిరుగాలిలో...
హ్రుదయ సవ్వడి విన్పించే..
నిశ్శబ్దమయ క్షణాలలో...
నా ప్రతికదలికలో..
నిద్రపుచ్చే అస్తమయంలో..
నాస్వప్నంలో..
నీతో కలసి గడిపిన క్షణాలు..
మనం చేసుకున్న బాసలు..
ఎల్లపుడూ ...
నన్ను వెంటాడు తుంటాయి నేస్తం..
ఏం చేయలేను నేను..
అశ్రునయనాలతో
భారమైన గుండెలతో
నివాలులర్పించడం..
నిత్యం జ్ణప్తి చేసుకోవడం తప్ప..
(ఆప్తమిత్రుడు బొత్స గణేష్ అకాల మరణానికి చింతిస్తూ..
ఆత్మ శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ...)
I too
ReplyDelete