అక్షరం దిద్దించిన చేయి..
అంతరంగాన్ని స్పృశిస్తుంది
గోరుముద్దంచిన చేయి..
గమ్యం నిర్దేశిస్తుంది
మీ ఒరవడిలో
పయనించాలనంటే..
పోరుబాట ఒకరిది..
శాంతిమార్గమింకొకరిది..
మంచి చెడులు కలగలిసిన
మనిషి జీవితంలో..
ఓటమిని ఆంగీకరించను నేను
విజయాన్నే వరిస్తాను నేను..
రెండువైపులా పదునున్న
కత్తిలా మార్చాలి నన్ను..
అను నిత్యం
ఆశీర్వదించాలి నన్ను..
మీరందించిన ఉత్తేజం..
అక్షరాన్ని ఆయుధం చేసింది..
ఆగదు నా పయనం..
ఊపిరి ఆగేంత వరకు..
(నా ఆధ్యాత్మ, భౌతిక గురుదేవులనుద్దేశించి..)
good one sairam
ReplyDelete