నా పయనం...
గూడు కట్టిన నిశీధి నుండి,
నిర్మలమైన వెలుగుకోసం..
స్వార్ధ పూరిత హృదయాలతో
తోటి మనిషిని గుర్తించని..
ఈ తిక మక లోకంలో..
పెదాలపై చిరునవ్వుని సైతం,
నమ్మ లేని ఈ జీవన గమనంలో.
ఇరుకైన మనసుల చట్రంలో,
ఒదగ లేక అలసిపోతున్నా..
పుట్టుక పరమార్ధం తెలియదు,
బ్రతుకంతా ఎడారైన క్షణంలో...
ఒయాసిస్సును వెతికే ,
ఒంటరి బాటసారిని నేను..
ఎవరికి అందని అక్షర రూపం నేను..
నా పయనం...
గూడు కట్టిన నిశీధి నుండి,
నిర్మలమైన వెలుగుకోసం..
ఇరుకైన మనసుల చట్రంలో,
ReplyDeleteఒదగ లేక అలసిపోతున్నా..
nice.
chaalaa baagundi...
ReplyDeleteThank u..
ReplyDelete