Apr 7, 2010

నగర జీవన చిత్రం..

ఉరుకుల పరుగుల జీవనం,
ఊబకాయమే ఒక వరం..

బడ్జెట్ వడ్డింపుల భారం,

కంపెనీ టార్గెట్లు కఠోరం..

షేర్ మార్కెట్ల బేజారు,

భవిష్యత్ ఊహల కంగారు..

సేవింగ్  చిట్ ఫండ్ షేవింగై,

లోన్ల మోత ఆరంభం..

కలుషితమైన  వాతావరణం,

క్రొత్త జబ్బుల విహారం..

ఉరుకుల పరుగుల జీవనం,
బట్టతల కూడా ఒక వరం..

అయినా  పోతాం ఢాంభీకం,

నవీన నగర జీవన గాంభీర్యం..

2 comments:

  1. బాగుందండి...
    ఇదే అంశం మీద నేను కూడా ఒక కవిత రాసాను. తొందర్లోనే నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

    ReplyDelete