Apr 8, 2010

అనాధలం..

అమ్మ తోడూ,
నాన్న నీడా కరువై,
బ్రతుకునీడ్చే బండలం..

గుక్కెడు మంచి నీళ్లూ,
పిడికెడు మెతుకుల కోసం,
వెదుకులాడే..

మా జీవితం చిధ్రం
నాగరీకులకిది విచిత్రం..

ఒంటినిండా బట్ట లేదు,
కప్పుకునే  శక్తి లేదు..

నిలువ నీడ లేదు,
ఆశ్రయమిచ్చే మనిషి లేడు..

అడుగడుకగునా అవహేళనలు,
చీత్కారాలే మాకు స్వాగతం..

ఈ పుట్టుక  మాకు శాపం,
మా బ్రతుకందరికీ అపహాశ్యం..

కాదిది దేవుడిచ్చిన వరం,
సమాజం సృష్టించిన అగాధం..

3 comments:

  1. కాదిది దేవుడిచ్చిన వరం,
    సమాజం సృష్టించిన అగాధం..

    baagundi... carry on..

    ReplyDelete