పెదబాబుగారి రికమండీసన్..
భూమి సిస్తు కట్టడానికి
విత్తనాలు కొనడానికి
నారుకు నీరు పెట్టడానికి
పొలం కంచె కట్టడానికి
నాటుబండి నడిచేందుకు
పండిన పంట అమ్మేందుకు
గిడ్డంగిలో ధర పలికేందుకు
మరి పంటకు అప్పు సేసేందుకు
పెద్దోని ఉద్యోగాన్కి
చిన్నోడి కాలేజి సదువుకు
ఇందిరమ్మ పొదుపుకు
ముసల్దాని పించనికి
కులపత్రం రాయాలన్నా
పక్కా ఇల్లు కట్టాలన్నా
కరెంటు కావాలన్నా
ఎలెచ్చెన్లో ఓటేయాలన్నా
అన్నిటికీ కావాల...
సివరికి నా సావుకు
ఎవరి రికమండీసన్ తేవాల..
No comments:
Post a Comment