May 8, 2013

గెలుపెవరిది...



భుజాలపై భారాన్నంతా మోస్తూ అతను,
అందినది దోచుకుని ఆనందించే నీవు..


తన అడుగే మొదటిదని పయనిస్తూ అతను,
ప్రతి అడుగూ భయంతో వేస్తూ నీవు..


స్వేచ్చకై శ్వాసిస్తూ అతను,
ఆధారం నుండి ముక్కు వరకు ఊపిరందక నువ్వు..


తన ఉనికితో బ్రతుకులను మార్చే బాటలో అతను,
ప్రజల ఉనికిని చిద్రం చేసి, నే ఉన్నానని చెప్పే నీవు..


చివరి అడుగుతోనైనా మార్పు కోరుకునే అతను,
చివరి శ్వాస వరకు జనాన్ని ఏమార్చే నీవు..


గెలిచేది ఎవరు...
ఎవరు...ఎవరు..

2 comments:

  1. కవిత్వం చాలా బాగుంది.మొదటి లైన్ లో మీరు వ్రాసిన వారే గెలవాలని నాబోటి సామాన్యులం అందరం దేవుడ్ని ప్రార్ధిద్దాం.

    ReplyDelete