May 9, 2013

వేసవి.. బాల్యం..

అమ్మ చేతి ముద్ద తింటుండగా,
స్నేహితుని పిలుపు విని..

పరిగెడుతూ, పడిలేస్తూ..

ఊరి చివరి కల్లంలో చింత చెట్టు క్రింద
ఆటలాడుతూ,  కాలాన్ని మర్చిపోతూ..

కోనేరులో జలకాలాటలూ, తుళ్ళింతలతో
వేసవి తాపాన్ని తీర్చుకుంటూ..

వాకాయపల్లు వగరు, చేదు, తీపిని
స్నేహితులతో ఆశ్వాదిస్తూ..

పరిగెడుతూ, పడిలేస్తూ..

తోటమాలి కల్లుగప్పి దాచిన యేనుగు మామిడిని
కాకెంగుల్లతో పంచుకుంటూ..

గెడ్డగట్టున తాటి దుంగపై జారుడు బల్లాడుతూ
ఇసుకలో గూల్లు కడుతూ..

ఈత చెట్టుకున్న మట్టి కుండని గురి చూస్తూ
కాపరి కేకలకు పరుగులంగించుకుంటూ..

పరిగెడుతూ, పడిలేస్తూ..

రైలు పట్టాలపై చెవి ఆనించి
బండి రాకను గమనిస్తూ..

కరణం గారి అరుగుపై
అష్టాచెమ్మాట, దాడి ఆటలాడుతూ..

సాయంత్రం కొత్త కోలనీలో
దొంగ పోలీసు, దాగుడుమూతలూ..

ఏనాటికీ మరువలేని
సహచరుల బంధం,స్నేహితుల సాన్నిహిత్యం..

వేసవిలో బాల్యం గుర్తువస్తే,
వయసు సగమై, మనసు చిందేస్తంది..

2 comments:

  1. వేసవిలో బాల్యాన్నినయనమనోహరంగా సాయిరాంగారు బొమ్మకట్టారు,ఇదొక మనోహరపదచిత్రం ,కవిగారు తమ పురాస్మ్ర్తుతు లను నెమరువేసుకున్నారు!

    ReplyDelete
  2. ధన్యవాదములు..

    ReplyDelete