శరీరపు శక్తినంతా,
కళ్లలోన్కి తీసుకొని చూస్తుంటే..
కనుచూపు పరిధిలో
మిగిలిందంతా శూన్యం..
మానవ బంధాలన్ని గొంతు నులిమి,
తమ స్వార్దపు కొలిమిలో కాల్చేసినా..
మిగిలిన మాంసపు ముద్దలకోసం,
విహారం చేస్తున్నాయి రాబందులు..
ఉన్న కాసింత శక్తిని కూడగట్టి,
కొన ఊపిరితో లేచి నిల్చున్నా..
మనిషిని మనిషిగా ప్రేమించే
కొత్త తరాల నిర్మాణం కోసం,
నాంది పలికి, వెనుక నడిచే వాల్లను,
మేల్కొలిపే కర్తవ్యం గుర్తెరిగి..
sairam గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం
ReplyDeleteహారం