Aug 22, 2010

ధనం మూలం..

కన్న వాళ్ల కౌగిలిని..

సహొదరుని సాన్నిహిత్యాన్ని..

స్నేహితుని పలకరింపుని..

నువ్వు ఆక్రమించేసావ్,

నా దగ్గరేం మిగల్లేదు..

నా ప్రాణం తప్ప,

అది కూడా తీసుకుపోతానంటే..

ఆనందమే నాకు..

కాసులే లేవు నా దగ్గర..

ఆప్యాయతానురాగాలు తప్ప,

నా వాల్లనందర్నీ తలచి.. తలచి.. జారే

రెండు కన్నీటి చుక్కలు తప్ప..

2 comments:

  1. కవితా శీర్షిక బాలేదు. expression is very good..

    ReplyDelete
  2. కాసుల గల..గల..ను ధనం మూలం అని మార్చాను...

    ReplyDelete