వైష్ణవి, ప్రభాకర్ లను మర్చిపోక ముందే.. మరో వార్తః కడప జిల్లా, పులివెందుల మండలం, మల్లిఖార్జున పురంలో పది సంవత్సరాల చిన్నారి స్వరూప రాణిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయగా, స్వరూప కేకలు వేయడంతొ
ఏడుగురిలో అయిదుగురు దుండగులను స్దానికులు పట్టుకున్నారని, ఈ కిడ్నాప్ సూత్రధారి స్వరూప కన్నతల్లి అనే వార్తను చూస్తే.. నేటి మానవులలో తల్లి పేగు బందానికి విలువ లేదన్పిస్తుంది.. మానభంగాలు, హత్యలు, దోపిడి, కబ్జాలు, మోసాల నుండి చిన్న పిల్లల దారుణ హత్యల వైపు మన సమాజం మారుతుంటే, ఇది మానవ సమాజమా లేక జంతు సమాజమా? అనే ప్రశ్న మనకు మనం వేసుకునే పరిస్దితి నేడు వచ్చింది. జంతువులు కూడా కన్నపిల్లలను చంపనపుడు, మాట, నడత, తెలివి, అన్ని రకాలుగా జంతువుల కంటే మెరుగైన జీవి అయిన మానవుడు స్వార్దం, డబ్బు సంపాదించాలనే ఆత్యాశ, సమాజంలో పలుకుబడి పెంపొందించుకోవడం కోసం జంతువుల కన్నా హీనంగా మారడం గర్హనీయం... నేటి మానవుని జీవన శైలి నాటి జంతు సమాజం కన్నా భయోత్పాతంగా తయారగుచున్నది. కొత్త రకమయిన నేరాలు రెండు దినాలలో పాతవగుచున్నవి. నేరానికి గల శిక్ష సంవత్సరాల క్రితం నాటిది, లోపభూయిష్టమైన న్యాయవ్యవస్ద, ఎందుకూ మకొరగాని చట్టాలు, ఎన్నికల వాగ్దానాల ప్రభువత్వాలు, పార్టీలు ఉన్నంత కాలం, సరి క్రొత్త నేరాఉ జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం..
మన వ్యవస్దను మనమే మార్చుకోవాలనుకొనే ఆలోచనతోనే సంవత్సరాలు గడిపేసాం.. క్రొత్త తరానికి కూడా పాత చింతకాయ పచ్చడి రీతిలొ.. అభద్రత, మోసపూరితమైన సమాజాన్ని అందిద్దాం....మనం మేలుకోవద్దు... మేలుకొలిపే వాళ్ళను సమాజం నుండి వెలి వేద్దాం... ఇలాగే బ్రతికినంతవరకు లేని నవ్వు పెదాలపై పులుముకొని, నటిస్తూ.. నటనలోనే జీవిస్తూ... బ్రతికేద్దాం.. బ్రతుకీడ్చేద్దాం...
మీ ఆవేదన అర్థవంతంగా వుంది. సమాజంలోని కుళ్ళు గురించి వ్యాఖ్యానించె వాళ్ళు ఎక్కువయ్యారు కానీ దానిని కడిగేందుకు నిబద్ధతతో పనిచేసే వారు కొరవడడంతో వచ్చిన దుస్థితి ఇది.
ReplyDelete