ఏల్ల తరబడి..
కన్నీటిని జారకుండా ఆపుకుంటున్నాం,
పంటిక్రింద వేదనను..
గుండెలోనే అదుముకుంటూ,
ఆప్తులకే దూరమవుతున్నాం..
కాలి క్రింద నేలనే,
కాజేయాలని చూస్తుంటే..
వేయి గొంతులతో నినదిద్దాం..
వేవేల పిడికిళ్ల శక్తిని నిరూపిద్దాం..
సామ్రాజ్యవాద రాక్షసి నెత్తికెక్కి..
ఉద్యమాలననచాలనుకున్న వారంతా,
చరిత్రలో కలిసిపోయారు..
విర్ర వీగిన వారంతా,
వీరుల చేతిలో నేలకొరిగారు..
రండి..కలిసి అడుగులేద్దాం..
బ్రతుకును మార్చే బాటవైపు..
బాగున్నయి కవితలు.
ReplyDeleteThank you..
ReplyDeleteమీకు వీలైనపుడు. ఇంకా మీ సూచనలు, సలహాలు ఉంటే వ్రాయగలరు.
nee vemTea maa aDugulu mitramaa.
ReplyDelete