Feb 6, 2010

ఇంకా ఎపుడు...


ధరలు ఎపుడో ఆకాశాన్ని అంటి సగటు మానవుని జీవనం అస్త వ్యస్తం అయింది.. ఎందరో ప్రజలు ఆర్ధిక పరిస్ధితి మెరుగుగా లేక ఆత్మార్పణలు చేసుకున్నారు.. ఉత్పత్తులు పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనుకోనవసరం లేదు, ఇదివరకు ఉన్న ఉత్పత్తులు "బ్లాక్‌ మార్కెటింగ్‌ " బారిన పడకుండా కాపాడడంలో మొదట ప్రభుత్వం సఫలీక్రుతం కావాలి.. బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడిన వారిని కటినంగా శిక్షించాలి...
ఇంతవరకు పెరిగిన ధరల వలన బడా వ్యాపారులు, దళారీలు గాది క్రింద పందికొక్కుల్లా తెగ సంపాయించారు. వారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభత్వ యంత్రాంగం బంధు ప్రీతి, ఇక ఏ ఇతరత్రా స్వలాభాపేక్షలు లేకుండా పని చేయగలిగితే ధరల పెరుగుదల నివారణ సాధ్యం అవుతుంది. "బ్లాక్‌ మార్కెటింగ్‌ " నివారణే ధరల అదుపుకు గల మార్గం అని నా అభిప్రాయం..

1 comment:

  1. అసలు బ్లాక్ మార్కెట్ ఎవరిది. ఈ రాజకీయ దళారీగాళ్ళదే కదా? అవినీతి అధికార్లు ఎందుకు చేస్తారు. నిజాయితీగా వున్నోడు రైలుపట్టాలపై తేలుతాడు. యిదంత వీజీ కాదీ వ్యవస్థలో...

    ReplyDelete