Feb 6, 2010
మరో మల్లయ్య...
బళ్ళారిలో భవనం కూలిన సంఘటనలో తొమ్మిది రోజులు శిధిలాల క్రింద బ్రతికిన వ్యక్తి పేరు మల్లయ్య, కాయ కష్టం చేసి బ్రతుకీడుస్తున్న ఆయన ప్రాణంతో అన్ని రోజులు బ్రతక గలిగితే కదా రక్షణ దళం కాపాడ గలిగారు, కాని ప్రాణం పోతే ఎవరు ఇవ్వగలరు..... ఇది జరిగిన రెండు, మూడు రోజుల్లో "మరో మల్లయ్య " (వాచ్ మేన్) హైదరాబాద్ నగరం నడి బొడ్డున నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఓ ఐదు అంతస్థులు భవనం పేక మేడలా కుప్పకూలి, భవనంలో పనిచేస్తున్న చేస్తున్న 13మంది మరణించగా వాచ్ మేన్ శిధిలాల క్రింద చిక్కు కున్నాడు. ఈ మల్లయ్యను ఎవరు కాపాడతారు.......పటిష్టమైన పునాదులు, పిల్లర్‌లను నిర్మించకుండానే పురాతన పిల్లర్‌లపైనే ఐదంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. కాగా భవన యజమాని కానీ, బిల్డర్‌కానీ జిహెచ్‌ఎంసి నిబంధనలను పాటించకపోవడమే కాకుండా నాణ్యతలేని నిర్మాణ సామాగ్రితో అక్రమంగా నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణ పనుల్లో సంబంధిత టౌన్‌ప్లానింగ్, ఇతర అధికారులను మచ్చిక చేసుకొని భవన నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. 13మందిలో ఒక పసి పాప కూడా చనిపోయింది, మిగిలిన పన్నెండు మంది పెద్దవారు. వీరంతా మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు. ఇలా నాసి రకం నిర్మాణాలు చేపట్టి.... యాజమాన్యం, అధికా రులు కలిసి ఎంతమంద ప్రాణాలను బలిగొంటారు. అధికారుల లంచగొండితనఒ పెట్టుబడి దారుల అవకాశమై సామాన్య ప్రజల ప్రాణాలపై గొడ్డలి పెట్టుగా మారింది. వ్రుత్తి నిబద్దతతో అధికార యంత్రాంగం, నిజాయితీతో ప్రభుత్వ శాఖలు పని చేస్తే మరెంత మందో మల్లయ్యలు (సామాన్య ప్రజానీకం) ప్రాణాలతో బ్రతుకుతారు..
Subscribe to:
Post Comments (Atom)
Now, with five and odd years of confress rule corruption has become organised and accepted by the authorities.Incidents like this are bound to happen.
ReplyDeleteఅవినీతిని తుదముట్టింవచేందుకు ప్రజలు జాగ్రుతం కావాలి...
ReplyDeleteఇది గత 60 ఏళ్ళుగా వున్నదే. కొత్తకాదు. అవినీతి బంధుప్రీతి చీకటి బజారు... స్వాతంత్ర్యం వచ్చెననీ.. అన్న మన ఘంటసాల గీతం గుర్తుకురాలేదా?
ReplyDelete